ఆర్మూర్, జూన్17; కాంగ్రెస్ అవినీతి కోరు అని.. బీజేపీ అబద్ధ్దాల కోరు అని ఆర్మూర్ ఎమ్మెల్యే , పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో ‘ నమస్తే నవనాథపురం’ లో భాగంగా శనివారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామంలో పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పిప్రి గ్రామంలో పెద్ద సంఖ్యలో కుల సంఘాల భవనాలు నిర్మించినట్లు పేర్కొన్నారు. అవుసలి సంఘానికి రూ 25లక్షలు, మున్నూరుకాపు సంఘానికి రూ.15లక్షలు, గురడికాపు సంఘానికి రూ.15లక్షలు, ఆరె సంఘానికి రూ.5లక్షలు తదితర కులా సంఘాలకు, గ్రామాభివృద్ధికి కోట్ల రూపాయాల నిధులు మంజూరు చేశామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణకు శత్రువులేనని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కష్టపడి పని చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచ్ అసపురం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు సురేశ్, ముఖేశ్, పీఏసీఎస్ చైర్మన్ హేమంత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు భోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ 13వ వార్డు పరిధిలోని అరుంధతీనగర్ కాలనీలో రూ .25లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న అరుంధతీనరగ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శనివారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం 24గంటలు జీతగాడిలా పని చేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు దమ్ముంటే ఆర్మూర్ అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. 3వేల కోట్లతో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. అరుంధతీనగర్ కాలనీ చెరువు కట్టపై డాంబర్ రోడ్డు వేయించానని, ఇక్కడి మహిళా సంఘాలకు రూ 25లక్షల వడ్డీ లేని రుణాలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని అన్నారు. అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ చౌరస్తాలను సుందరీకరించామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితాపవన్, వైస్ చైర్మన్ మున్న, కౌన్సిలర్లు భారతీభూషణ్, సుజాతా రమేశ్, రవిగౌడ్, ఆకుల రాము, పట్టణ అధ్యక్షుడు పూజనరేందర్, సీనియర్ నాయకులు పండిత్ పవన్, అంజాగౌడ్, జీజీరాం, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.