డిచ్పల్లి/ ఇందల్వాయి, జనవరి 7 : డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి గ్రామంలో బీఆర్ఎస్ బూత్ కమిటీని శనివారం ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులకు నియామకపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనర్సయ్య, రైతుబంధు సమితి కన్వీనర్ జీనియస్ నారాయణరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దండవుల సాయిలు, సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, నల్లవెల్లి సాయిలు, నడిపన్న, ఇన్చార్జి పద్మారావు, బర్ధిపూర్ సొసైటీ చైర్మన్ రామకృష్ణ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు విఠల్‌రాథోడ్, యూత్ అధ్యక్షుడు అమీర్, జనరల్ సెక్రటరీ హరికిషన్, ఎస్సీసెల్ అధ్యక్షుడు ప్రమోద్, మెంట్రాజ్‌పల్లి గ్రామశాఖ అధ్యక్షుడు భూమేశ్, ఉపసర్పంచ్ రాజలింగం, సొసైటీ వైస్‌చైర్మన్ నవీన్ పాల్గొన్నారు.
ఇందల్వాయి మండలంలోని డొంకల్, కేకే తండా గ్రామాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి గంగాదాస్ ఆధ్వర్యంలో బూత్ కమిటీలను శనివారం నియమించారు. గ్రామంలోని ప్రతి వంద మంది ఓటర్లకు ఒక సభ్యుడిని ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు విఠల్‌రెడ్డి, రాములు నాయక్, సీనియర్ నాయకుడు పాశం కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.