నిజాంసాగర్ : మహా శివరాత్రి ( Maha Shivaratri ) సందర్భంగా ఉపవాసాలుండే భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదానాలు (Annadanam ) గురువారం ఊరూరా నిర్వహించారు. ముఖ్యంగా శివాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఆలయ నిర్వాహకులతో పాటు స్థానిక యువకులు, భక్తులు కలిసి అన్నదానాలు నిర్వహించారు.
మహమ్మద్ నగర్ ( Mohammad nagar) మండలంలోని కొమలంచ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం ఉదయం ఆలయంలో మహ అన్నదానం నిర్వహించారు. స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సైతం వచ్చి అన్నదానంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కుమ్మరి రాములు, తాటిచెట్ల రామా గౌడ్, భజన మండలి భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.