లింగంపేట్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections ) బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ ఎన్నికల ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి హైమారెడ్డి పట్టభద్రులను కోరారు. సోమవారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో ఆమె పట్టభద్రులతో కలిసి ప్రచారం చేశారు. ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలుపొందితే యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆమె వెంట కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, మండల అధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి నవీన్ తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.