కంఠేశ్వర్, ఏప్రిల్ 24 : అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్, మినీ టీచర్స్ అందరికీ మే నెలలో ఒకేసారి సెలవులు అమలు చేయాలని అంగన్వాడీ టీచర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో ఏవో ప్రశాంత్తోపాటు ఐసీడీఎస్ సూపరింటెండెంట్ ఇంద్రకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం మే నెలలో ఒకేసారి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లకు వెంటనే సెలవులు ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ విరమణ చేసిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రిటర్మైంట్ బెనిఫిట్స్, మినీ టీచర్లకు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దేవగంగు, స్వర్ణ, జిల్లా నాయకులు మంగమ్మ, శివరాజమ్మ, రాజ్యలక్ష్మి, విజయ, గోదావరి, ప్రమీల, జ్యోతి, లక్ష్మి, వాణి, సునీత పాల్గొన్నారు.