రుద్రూర్, నవంబర్ 28 : మండల కేంద్రం నుంచి బోధన్‌కు ప్రయాణమంటేనే ప్రయాణికులు హడలెత్తేవారు. కేవలం ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించేందుకు సుమారు గంట సమయం పట్టేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. రుద్రూర్ నుంచి బోధన్‌కు పదినిమిషాల్లో చేరుకుంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వేసిన రుద్రూర్-బోధన్ రోడ్డు గత రెండుమూడేండ్లుగా అధ్వానంగా మారింది. పూర్తిగా గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించాలంటేనే గంటసమయం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వానకాలంలో అనేక మంది వాహనదారులు ప్రమాదాలబారినపడ్డారు. వాహనదారులు, ప్రయాణికుల ఇబ్బందులను స్థానిక నాయకులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రోడ్డు మరమ్మతుల కోసం సుమారు రూ.2.65కోట్లు కేటాయించారు. ఆ నిధులతో రోడ్డు పనులు చేపట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్‌తోపాటు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సమస్య పరిష్కారమైంది
రోడ్డుకు మరమ్మతులు చేపట్టడంతో సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు పదినిమిషాల్లోనే బోధన్‌కు వెళ్తున్నాం. రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. రోడ్డు మరమ్మతులకు నిధులు కేటాయించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.