పోతంగల్ : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలూ భక్తి మార్గంలో నడుచుకోవాలని బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ స్వామి (Balayogi Pitla Krishna Maharaj) అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గ బీసీ కాలనీలో అఖండ హరినామ సప్తహాన్ని (Akhanda Harinama Saptaham) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్థులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అఖండ హరినామ సప్తహాంలో ఏర్పాటు చేసిన విఠలేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రవచనాలు వినిపించారు. పూజించే దేవుళ్లపై భక్తీభావం, తల్లిదండ్రులపై ప్రేమాభిమానాలు, పేదలకు సేవాకార్యక్రమాలు నిర్వహించి ధన్యులు కావాలని సూచించారు.