నిజాంసాగర్, జనవరి 29: నాందెడ్‌లో ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే ఆదివారం నాందెడ్ మాజీ ఎంపీ భాస్కర్‌రావ్ పాటిల్ ఖత్వాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. మహారాష్ట్రలో బీఆర్ఎస్ను నాయకులు, ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని, పార్టీలోకి వచ్చేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రధాని అయితే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు ఇక్కడ కూడా అమలుచేస్తారన్నారు. ప్రజలు ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.