జక్రాన్పల్లి, ఏప్రిల్ 23: జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జక్రాన్పల్లిలో ప్రతిపాదిత స్థలాన్ని ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అథారిటీ అధికారులు బుధవారం పరిశీలించారు. జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు విషయంలో ప్రజలు ఆశలు వదులుకున్న తరుణంలో అధికారులు పర్యటించడంతో మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి.
ఈ విషయమై అధికారులు మాట్లాడుతూ.. ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం గతంలో ప్రతిపాదించిన స్థలంలో నిర్వహించిన సర్వేకు ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా అనే విషయంలో సర్వే నిర్వహించినట్లు చెప్పారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటు ప్రతిపాదనలో ఉన్నదని తెలిపారు. దీంతో ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్, ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ కిరణ్మయి, గిర్దావర్ ప్రవీణ్, సర్వేయర్లు ధనియల్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.