సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలో దరఖాస్తు ఫారాల కోసం ప్రజలు ఎగబడ్డారు. మొదటి రోజు కావడంతో దరఖాస్తు ఫారాలు ఎక్కువ రాకపోవడంతో తమకు దొరుకుతాయో లేదోనని ప్రజలు ఆందోళన చెందారు. ప్రజలంతా ఎగబడడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
చివరకు అధికారులు జిరాక్సులు తీయించి ప్రజలకు అందజేశారు. బిచ్కుందలో ఫారాల పంపిణీ సందర్భంగా తోపులాట చోటు చేసుకున్నది. కొందరికి ఫారాలు అందకపోవడంతో జీపీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తహసీల్దార్ చొరవ తీసుకొని ఫారాలు అందజేయడంతో ఆందోళన విరమించారు.