కంటేశ్వర్, మే 21 : నిజామాద్ జిల్లా వ్యవసాయ శాఖ ఏడీఏ ప్రదీప్ కుమార్ సస్పెన్షన్కు గురయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15న బాధిత కుటుంబ సభ్యులు కలెక్టరేట్లో చనిపోయిన ఏవో ఫొటోతో నిరసన వ్యక్తం చేశారు. కాగా చనిపోయి ఏడాదైన బెనిఫిట్స్ ఇవ్వరా.. అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది.
కాగా దీంతో స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులు నిజామాబాద్ జిల్లా ఏడీఏ ప్రదీప్ కుమార్ పై జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ బీ సింగారెడ్డి , జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శివాజీ పాటిల్ తో కమిషన్ వేసి విచారణ చేపట్టారు. తదనంతరం వారి నివేదిక మేరకు ఏడీఏ ప్రదీప్ ను సస్పెండ్ చేస్తున్నట్టు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా బాధిత ఏవో కుటుంబ సభ్యులు, పలువురు ‘నమస్తేతెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు.