కామారెడ్డి, సెప్టెంబర్ 23: కామారెడ్డిలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సోమవారం సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని బాంబే క్లాత్‌ను ఆయన ప్రారంభించారు. తమ అభిమాన హాస్య నటుడిని చూసేందుకు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు భారీగా తరలి వచ్చారు .
షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన బ్రహ్మానందంతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. షోరూం నిర్వాహకులు హాస్య నటుడిని ఘనంగా సత్కరించారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ, వీటీ రాజ్‌కుమార్, వీటీ లాల్ తదితరులు పాల్గొన్నారు.