వినాయక నగర్ : నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి ( Police custody ) తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆటోనగర్‌కు చెందిన ఇలియాస్ అనే వ్యక్తి శుక్రవారం రోజు ఇంటికి తాళం వేసి నైట్ డ్యూటీ కి వెళ్లడంతో దుండగులు ఆయన ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. బీరువాలోని 8 తులాల బంగారు నగలతో పాటు 25 వేల నగదు చోరీ జరిగినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఆరవ టౌన్ ఎస్సై వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్‌ను ( CC Footage ) పరిశీలించిన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చోరీ జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో సదరు అనుమానితుడు సంచరించడం ఆ ఇంటి ఏరియాలో నిందితుడు ఆనవాళ్లు సీసీ కెమెరాలు రికార్డు కావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.