కల్లుదుకాణం తరలింపునకు రూ.2లక్షలు డిమాండ్
ఉమ్మడి జిల్లాలో అవినీతి ఉద్యోగులు, అధికారుల తీరుమారడంలేదు. లం చాలకు అలవాటుపడిన కొందరు ఉద్యోగులు సామాన్యుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా బిచ్కుందలో ఎక్సైజ్ సీఐ ఏసీబీ అధికారులకు చిక్కాడు. క
- నిర్వాహకుడి నుంచి తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్ సీఐ
- కేసు నమోదుచేసి నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ వెల్లడి
బిచ్కుంద, ఏప్రిల్ 17: ఉమ్మడి జిల్లాలో అవినీతి ఉద్యోగులు, అధికారుల తీరుమారడంలేదు. లం చాలకు అలవాటుపడిన కొందరు ఉద్యోగులు సామాన్యుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా బిచ్కుందలో ఎక్సైజ్ సీఐ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కల్లు దుకాణం నిర్వాహకుడి నుంచి రూ. 2లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ శేఖర్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
మద్నూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి తన కల్లు దుకాణాన్ని మరో గ్రామానికి తరలించడానికి అనుమతి ఇవ్వాలని, కేసులు చేయవద్దని ఎక్సైజ్ సీఐ సత్యనారాయణను ఆశ్రయించాడు. ఇందుకు ప్రతిఫలంగా తనకు రూ.3లక్షలు ఇవ్వాలని సీఐ డిమాండ్ చేశాడు. చివరికి రూ. 2లక్షలకు సెటిల్మెంట్ చేసుకొన్న బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బిచ్కుందలో అద్దె ఇంట్లో ఉంటున్న ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ బాధితుడి నుంచి రూ.2లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అనంతరం అద్దె ఇంట్లో సోదాలు నిర్వహించగా లెక్కలో లేని రూ.45వేలు లభ్యంకాగా, అదే సమయంలో హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌లో సీఐ సత్యనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.12లక్షలు లభ్యం కావడంతో సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సీఐపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ 9440446106 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

