నేడు కరీంనగర్లో ఐఎంఏ మెడికల్ కాన్ఫరెన్స్.. వైద్యరంగ సమస్యలపై చర్చలు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్‌లోని కేఎస్ఎల్ కన్వెన్షన్ సెంటర్లో జోన్-2 మెడికల్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా ఐఎంఏ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులతో పాటు జోన్-2 పరిధిలోని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన వివిధ స్పెషాలిటీల వైద్యులు హాజరుకానున్నారు.
- తొలిసారిగా సాన్ క్లప్ క్రీడా, సాంసృతిక పోటీలు
కరీంనగర్ విద్యానగర్, ఆగస్టు 1 : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్‌లోని కేఎస్ఎల్ కన్వెన్షన్ సెంటర్లో జోన్-2 మెడికల్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా ఐఎంఏ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులతో పాటు జోన్-2 పరిధిలోని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన వివిధ స్పెషాలిటీల వైద్యులు హాజరుకానున్నారు. ఇప్పటికే జోన్-1, జోన్-3 కాన్ఫరెన్స్‌లు హైదరాబాద్, ఖమ్మంలో విజయవంతంగా నిర్వహించగా, జోన్-2 సదస్సుకు కరీంనగర్ ఆతిథ్యమిస్తోంది.
సదస్సులో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీ కిషన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల్గొని వైద్యుల వృత్తిపరమైన సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిషార మార్గాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. కాన్ఫరెన్స్‌లో తొలిసారిగా సాన్ క్లప్ పేరుతో వైద్యుల కోసం క్రీడా, సాంసృతిక పోటీలను ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర క్రీడల వైస్ చైర్మన్ డాక్టర్ పొలాస రామకిరణ్ తెలిపారు. అలాగే ఐఎంఏ మెడికల్ జర్నల్ను ఆవిషరించడంతో పాటు, ఐఎంఏ అనుబంధ విభాగాలైన జూనియర్ డాక్టర్స్ నెట్ వర్, మెడికల్ స్టూడెంట్స్ నెట్ వర్లను ప్రారంభిస్తారు. ఈ సదస్సు ద్వారా వైద్యులకు ఆధునిక వైద్య పరిజ్ఞానంపై అవగాహన పెరగడంతో పాటు వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్, ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం.ఎల్.ఎన్. రెడ్డి తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

