ఆర్మూర్ : పట్టణంలోని ఓ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్ నీటి సంపులో ( Water Sump) పడి ఓ గుర్తు తెలియని మహిళ ( Women) మృతి చెందింది. ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ (SHO Satyanarayana) తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ కాలనీలో అల్జాపూర్ రాజేష్ అనే వ్యక్తి కొత్తగా భవనాన్ని నిర్మిస్తున్నాడని తెలిపారు.
గురువారం ఉదయం గుర్తు తెలియని మహిళ (45) అక్కడికి రాగా ఆమెకు ఫిట్స్ రావడంతో సంపులో పడిందని భవనం వాచ్మెన్ తెలిపాడని వెల్లడించారు. వాచ్మెన్ సమాచారం మేరకు సంప్‌లో గాలించగా మహిళ మృతదేహం లభ్యమైందని వివరించారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.