సిరికొండ : సిరికొండ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 532లో భూలబ్ధిదారులపై అటవీ అధికారుల దౌర్జన్యాన్నీ అరికట్టాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్‌లైన్ (CPI(ML) Massline) పార్టీ నాయకులు ఆరోపించారు. లబ్ధిదారులతో కలిసి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్, రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ మాట్లాడుతూ 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను సాగుచేసుకుంటున్న పేదలకు పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఇటీవల అటవీ అధికారులు (Forest officials) దాడి చేసి సాగును అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
గత 20 సంవత్సరాలకు పైగా లబ్ధిదారులను అనేక విధాలుగా వేధిస్తూ అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. పట్టాలు పొందిన లబ్ధిదారులకు అనుకూలంగా హైకోర్టు ( High Court ) తీర్పు చెప్పిందని, తీర్పును అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. సిరికొండ 532 సర్వే నంబరు లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్, డివిజన్ నాయకులు ఆర్.దామోదర్, బి.బాబన్న, మండల నాయకులు రమేష్, ఎం.డి. అనిస్, ఎస్.కిషోర్, బి .నాగన్న, జహీరా బీ, గంగవ్వ, గంగాధర్, స్వరూప, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.