రెంజల్, జూన్ 6: మండలంలోని దండిగుట్ట తండాకు చెందిన పశువుల కాపరి బానోవత్ పీర్యానాయక్(85) పిడుగుపాటుతో మృతి చెందాడు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కళ్యాపూర్ శివారులోని అలకుంట చెరువు వద్ద రోజూ మాదిరిగానే గురువారం పీర్యానాయక్ గేదెలు మేపుతున్నాడు. ఆకస్మాత్తుగా కురిసిన వర్షంతో తడవకుండా ఉండేందుకు దగ్గరలోని మామిడిచెట్టు కిందకు చేరుకున్నాడు. దీంతో పీర్యానాయక్పై ఒక్కసారిగా పిడుగుపడడంతో ఛాతికింది భాగంలో మంటలు అంటుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని భార్య బూలీబాయి కోరారు.