నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 26: భారత గణతంత్ర దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పార్టీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద మూడురంగుల జెండాను అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎగురవేశారు.
జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, భూపతిరెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, ట్రెయినీ కలెక్టర్ సంకేత్, డీఎఫ్‌వో వికాస్‌మీనా, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, మానాల మోహన్‌రెడ్డి, గడుగు గంగాధర్, డీసీపీ బస్వారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
జడ్పీ, కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్ జెండాను ఎగురవేయగా.. మేయర్ దండు నీతూకిరణ్ శేఖర్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అడిషనల్ కమిషనర్ శంకర్, డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్, మున్సిపల్ ఇంజినీర్ మురళి పాల్గొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ జెండాను ఎగురవేశారు. అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ పాల్గొన్నారు. నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్తే తెలంగాణ నిజామాబాద్ యూనిట్ కార్యాలయంలో బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మాజు జెండా ఎగరవేశారు. బ్యూరో ఇన్చార్జి జూపల్లి రమేశ్, ఏడీవీటీ మేనేజర్ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో తెలంగాణ జాగృతి నాయకుడు అవంతికుమార్, టీయూ పరిపాలన భవనం వద్ద వైస్ చాన్స్‌లర్ యాదగిరిరావు, డిచ్పల్లిలోని ఏడో బెటాలియన్‌లో కమాండెంట్ పి.సత్యనారాయణ జెండాను ఎగురవేశారు. టీయూలోని న్యూబాయ్స్ హాస్టల్లో ఎస్ఎఫ్ఐ టీయూ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పఠనం చేశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
నగరంలోని కాకతీయ, విశ్వవికాస్, ఆర్బీవీఆర్ఆర్, అభ్యాస స్కూల్, విజయ్ హైస్కూల్ విద్యార్థులు దేశభక్తి పాటలతోపాటు, జానపద నృత్యాలు చేశారు. విద్యార్థులకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. పోలీస్ కార్యాలయంలో అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్(అడ్మిన్) జి.బస్వారెడ్డి, ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో అదనపు డీసీపీ రామచందర్ రావు, సీపీ క్యాంప్ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ శ్రీనివాస్ రావు, డీఐజీ జోన్-2 క్యాంప్ కార్యాలయంలో మేనేజర్ టి.రాజాప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి సునీత కుంచాల జెండాను ఎగురవేసిన అనంతరం పోటీల్లో గెలుపొందిన న్యాయవాదులకు బహుమతులను అందజేశారు.
బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆవిష్కరించారు. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వెంకట నారాయణ, న్యాయస్థానంలో జిల్లా అదనపు ఐదో న్యాయమూర్తి రవికుమార్ జెండాను ఎగురవేశారు. ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ శ్రీనివాస్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఎంవీఐ డి.శ్రీనివాస్, ఆర్టీసీ డిపోలో డీఎం శ్రీనివాస్, పట్టణ సీఐ కార్యాలయంలో సీఐ వెంకట నారాయణ, ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ పవన్ గౌడ్, ఏఎంసీ కార్యాలయంలో చైర్పర్సన్ అంకు సంధ్యదాములు జాతీయ జెండాను ఎగుర వేశారు.
ఆర్మూర్ కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి నసీం సుల్తానా, అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వర్‌రెడ్డి, మాక్లూర్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ట్రైనీ కలెక్టర్ సంకేత్‌కుమార్ జాతీయ జెండను ఆవిష్కరించారు. బోధన్‌లో ఏకచక్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాలు చేసిన 101 అడుగుల జాతీయజెండాను ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి స్విచ్ఛాన్ చేసి ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన సభలో చరిత్ర పరిశోధకుడు కందకుర్తి యాదవరావు, సంఘ సేవకురాలు గుర్రాల సరోజనమ్మ, తెలుగు వెలుగు సాహితీ వేదిక నంది పురస్కార గ్రహీత గోత్రాల గట్టు నర్సింహులు తదితరులను ఎమ్మెల్యే సన్మానించారు.