మోర్తాడ్, ఆగస్టు 20: పేకాట రాయుళ్లు బరి తెగించారు. ఏకంగా బంకెట్ హాల్‌ను రెంట్‌కు తీసుకుని పేకాట క్లబ్‌గా మార్చేశారు. దీనిపై ఉప్పందడంతో కమ్మర్పల్లి పోలీసులు సోమవారం అర్ధరాత్రి దాడి చేసి 35 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి నాలుగు కార్లు, ఒక బైక్, 35 సెల్ఫోన్లు, 228 కాయి న్లు, రూ.2,38,200 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారిలో ఒకే ఒక వ్యక్తి కమ్మర్పల్లి మండ లం నాగాపూర్ వాసి కాగా, మిగతా వారం తా మెట్పల్లి, మంచిర్యాల, బాన్సువాడ, బోధన్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బంకెట్ హాల్‌ను రెంట్‌కు తీసుకుని పేకాట క్లబ్బుగా మార్చిన వైనం పోలీసులను షాక్‌కు గురి చేసింది. దీనికి ప్రధాని సూత్రధారి నాగపూర్ వాసిగా అనుమానిస్తున్నారు.
అతడు గతంలో కూడా జిల్లా సరిహద్దులోని వివిధ ప్రాంతా ల వారిని పిలిచి పేకాడించే వాడని తెలిసింది. ఇప్పుడు బంకెట్ హాల్‌ను రోజుకు రూ.2 వేల చొప్పున అద్దెకు తీసుకుని పేకా ట శిబిరం కొనసాగిస్తున్నట్లు సమాచారం. కొంతకాలంగా సాగుతున్న ఈ తతంగంపై సమాచారం అందడంతో పోలీసులు సోమవారం అర్ధరాత్రి దాడి చేశారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు.