కంఠేశ్వర్ ఆగస్టు 25 : లైన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ 28వ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ సభ్యులు అందరికి బహుమతులతో ఘనంగా సత్కరించారు. 2025-26 సంవత్సరానికి అధ్యక్షులుగా లయన్ సత్యప్రసాద్ గుప్తాను, సెక్రెటరీ లయన్ ఉత్తం కుమార్, కోశాధికారి లయన్ రవికుమార్, ఇతర లయన్ సభ్యులను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు పలువురు అభినందనలు తెలియజేశారు.
ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త హాజరై మాట్లాడుతూ.. లయన్స్ అంటే మహా సముద్రం లాంటిదని సమాజ సేవలో ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. సమాజ సేవలో లయన్స్ సభ్యులకు తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు లయన్ సిర్ప రాజేశ్వర్, మాజీ ట్రెజరర్ లయన్ డి. రాజు , మాజీ సెక్రటరీ లయన్ శ్రీనివాస్, లయన్ హర్దీప్ సింగ్, లయన్స్ సభ్యులు పాల్గొన్నారు.