బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Dec 30, 2020 , 01:37:51

ఘనంగా దత్త జయంతి

ఘనంగా దత్త జయంతి

నందిపేట్‌/వేల్పూర్‌/నిజామాబాద్‌ రూరల్‌/ఆర్మూర్‌/కోటగిరి/ డిచ్‌పల్లి/బోధన్‌/నందిపేట్‌ రూరల్‌/నవీపేట: జిల్లాలో దత్త జయంతిని భక్తులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ, సాయిబాబా మందిరాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీలు, దాతలు భక్తులకు అన్నదానం చేశారు. నందిపేట్‌ మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో మంగి రాములు మహరాజ్‌, నిజామాబాద్‌ మం డలం మల్లారం గ్రామశివారులో ఉన్న లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో పిట్ల కృష్ణ మహరాజ్‌  దత్తాత్రేయ స్వామి డోలారోహణలో పాల్గొన్నారు. నవీపేటలోని లింగం గుట్టలో ఉన్న శనీశ్వర సహిత స్వ యంభూ శివాలయంలో రాజయోగి సిద్ధేశ్వర మహరాజ్‌ భక్తులకు ప్రవచనాలు బోధించారు. వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రా మ సమీపంలోని సాయిబాబా ఆలయంలో దత్తాత్రేయ జయంతిని భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామంలోని సాయిబాబా మందిరంలో ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినిత మహిళా భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. సిద్ధుల గుట్ట పక్కన ఉన్న గుండం వద్ద దత్త జయంతిని క్షత్రియ సమాజ్‌ ప్రతినిధులు వైభవంగా నిర్వహించారు. కోటగిరి మండలంలోని దత్తత్రేయ జయంతిని ఘనంగా నిర్వహించారు. డిచ్‌పల్లి మండలంలోని దూస్‌గామ్‌లో దత్త జయంతిని ఘనంగా నిర్వహించారు. బోధన్‌ పట్టణంలోని రాధాకృష్ణ మందిరం, రాకా సీపేట్‌లోని దత్తాత్రేయ మందిరం, చక్రేశ్వరాలయాల్లో భక్తులు దత్త జయంతిని నిర్వహించారు. నందిపేట్‌ మండలం దత్తాపూర్‌ గ్రా మంలో దత్త జయంతిని భక్తులు ఘనంగా నిర్వహించారు.


logo