అమరావతి : వైస్ఎస్ జగన్ పాలనపై(Jagan rule) కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక్కచాన్స్ అంటూ జగన్ సీఎం అయి ప్రజలను మోసం చేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ తరఫున ఆమె విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని(Capital city) లేని రాష్ట్రంగా తయారు చేశారని షర్మిల విమర్శించారు.
ఏపీలో రాజధాని ఎక్కడో చెప్పుకోలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ఒక్కసారి అవకాశమిస్తే అమెరికాలోని వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని చేస్తానని జగన్ చెప్పారు. కానీ గెలిచాక ఏపీకి రాజధానే లేకుండా చేశాడని ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధి కోసం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.