శనివారం 28 నవంబర్ 2020
Nizamabad - Nov 21, 2020 , 02:59:11

‘బోధన్‌ వీడీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్న’

‘బోధన్‌ వీడీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్న’

బోధన్‌ : బోధన్‌ గ్రామాభివృద్ధి కమిటీ, మహాలక్ష్మి ఆలయ ట్రస్ట్‌ అధ్యక్షుడిగా అనేక దశాబ్దాలపాటు కొనసాగిన గంగాధర్‌రావు పట్వారీ తాను అధ్యక్షుడి బా ధ్యతల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. బోధ న్‌ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం కల్యాణ మండపంలో బోధన్‌ వీడీసీ సర్వసభ్యసమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో గంగాధర్‌రావు పట్వా రీ ఏకధాటిగా అధ్యక్షుడిగా కొనసాగుతుండడం, దశాబ్దాలుగా గ్రామాభివృద్ధి కమిటీ, మహాలక్ష్మి ఆలయం ట్రస్ట్‌ లెక్కలు చూపించకపోవడంపై పలు కులసంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. కమిటీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశా రు. దీంతో తాను గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ ట్రస్ట్‌ అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని, తన ఆరోగ్యం బాగోలేనందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన ప్రకటించారు. సమావేశంలో కులసంఘాల ప్రతినిధులు బండారు పోశెట్టి, సింగం బాగారెడ్డి, జల్ల లక్ష్మణ్‌, బీర్కూర్‌ గంగాధర్‌, గుంత గంగాధర్‌, గుమ్ముల అశోక్‌రెడ్డి, బెనజీర్‌ గంగారాం, సూరి, సూర లింగారెడ్డి, నక్క లింగారెడ్డి, గుమ్ముల సాయారెడ్డి, పూజారి లింగం, పసులోటి గోపీకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.