గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Oct 11, 2020 , 06:21:57

బంగారంతో ‘కవిత లాకెట్‌'

బంగారంతో ‘కవిత లాకెట్‌'

  • తయారుచేయించుకున్న వీరాభిమాని హన్మాండ్లు

నవీపేట: మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై అభిమానంతో  ఆమె చిత్రంతో కూడిన బంగారు లాకెట్‌ను చేయించుకున్నారు నవీపేట మండల వాసి. నవీపేట మండలం నాళేశ్వర్‌ గ్రామానికి చెందిన బినోలా సొసైటీ చైర్మన్‌ మగ్గారి హన్మాండ్లు మాజీ ఎంపీ కవిత చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తుంటారు. ఆమె చేపడుతున్న సేవా కార్యక్రమాలపై పాటలు, కథలు రూపొందించి పోస్టు చేస్తుంటారు. గతంలో తన చేతిపై పచ్చబొట్టుతో కవిత పేరు రాయించుకొని అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత భారీ మెజార్టీతో గెలవాలని ఆమె బొమ్మతో బంగారు లాకెట్‌ చేయించుకున్నారు. ఏడు గ్రాములతో దానిని చేయించినట్లు ఆయన చెప్పారు.


logo