గురువారం 04 జూన్ 2020
Nizamabad - Mar 06, 2020 , 01:59:41

పట్టణ ప్రగతి సక్సెస్‌

పట్టణ ప్రగతి సక్సెస్‌

నిజామాబాద్‌ సిటీ/ ఖలీల్‌వాడి : తెలంగాణ ప్రభుత్వం పట్ణణాలను అభివృద్ధి చేయాలన్న ఆ లోచనతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షణలో ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, అధికారులు వార్డుల్లో అభివృద్ధి పనులు ఉత్సాహంగా నిర్వహించారు. ఆయా ము న్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను గుర్తించారు. ప్రజలకు పరిశుభ్రత, హరితహారం తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమం పదిరోజులపాటు ముమ్మరం గా జరుపుకొన్నారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నా రు. ఇదే స్ఫూర్తితో కార్పొరేషన్‌, మున్సిపల్‌లో ని అన్ని వార్డులు అభివృద్ధి దిశగా కొత్త రూపాన్ని సంతరించుకోనున్నాయి. 


ప్రజల భాగస్వామ్యంతో  కార్యక్రమాలు..

జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో అన్ని వార్డుల్లో కొనసాగింది. జిల్లాలో నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్‌, బోధన్‌, భీమ్‌గల్‌ మున్సిపాల్టీలున్నాయి. నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో 60 డివిజన్లు, ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు, భీమ్‌గల్‌ మున్సిపల్‌ పరిధిలో 12 వార్డు లు, బోధన్‌ మున్సిపల్‌ పరిధిలో 26 వార్డులున్నా యి. ఫిబ్రవరి 24వ తేది నుంచి మార్చి 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాలు పదిరోజులపాటు కొనసాగాయి. భీమ్‌గల్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌లో ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మేయర్‌ నీతూ కిరణ్‌ ప్రారంభించారు. ఆర్మూర్‌లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్‌ కార్యక్రమాన్ని షురూ చేశా రు. 


కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో ప్రతివార్డుకి స్పెషల్‌ ఆఫీసర్లను నియమించారు. ప్రతి వార్డులో పరిశుభ్రత, పచ్చదనం, ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధం, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మా ణం, విద్యుత్‌ సమస్యల పరిష్కారం, తడి, పొడి చెత్త సేకరణలాంటి కార్యక్రమాలు నిర్వహించారు.  ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్ర త్యేక అధికారులు ప్రజల భాగస్వామ్యంతో చురుకుగా పాల్గొన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా అధికారులు పంపిణీ చేసిన బుట్టల్లో తడి, పొడి చెత్తను వేసి మున్సిపల్‌ రిక్షాల్లో వేసేలా చర్యలు తీసుకున్నారు. మురికికాలువల్లో చెత్త, చెదారం, ప్లాస్టిక్‌ వ్యర్ధాలు పారవేయకుండా స్థానికులకు అవగాహన కల్పించారు. హరితహారంలో భాగం గా మొక్కలు నాటి వాటి పెంపకం చేపట్టి సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయడంలో పట్టణ ప్రగతి కార్యక్రమం సక్సెస్‌య్యింది. 


స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజలు..

పట్టణంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు క ల్పించడానికి చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమవం తు సహాయసహకారాలు అందించారు. వార్డుల్లో అధికారులతోపాటు స్థానికులు, మహిళలు, యు వకులు, విశాంత్రి ఉద్యోగులు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. మున్సిపాలిటీలకు అవసరమైన పనుల కోసం తమవంతు సహాయం చేశారు. తమ వార్డులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీ సుకుంటామని అధికారులకు హామీ ఇచ్చారు. తమ కాలనీలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకున్నారు. కాలనీల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడంపై ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. 


logo