శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Feb 02, 2020 , 01:02:14

కార్టూనిస్టు శివకు సికాకో హానరెబుల్‌ మెన్షన్‌

కార్టూనిస్టు శివకు సికాకో హానరెబుల్‌ మెన్షన్‌

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : మండలంలోని బషీరాబాద్‌కు చెందిన కార్టూనిస్టు శివను మరో అవార్డు వరించింది. దేశంతో పాటు విదేశాల్లో కార్టూన్‌ పోటీల్లో అవార్డులు సొంతం చేసుకున్న శివ తాజాగా కొరియా దేశంలోని అంతర్జాతీయ ఆర్గనైజేషన్‌ సికాకో సంస్థ నిర్వహించిన కార్టూన్‌ కాంపిటీషన్‌లో హానరెబుల్‌ మెన్షన్‌ అవార్డు సాధించాడు. హాట్‌ అండ్‌ కోల్డ్‌ అంశంలో శివ వేసిన కార్టూన్‌కు ఈ అవార్డు లభించింది. ఈ కార్టూన్‌ను సికాకో సంస్థ ముద్రించిన పుస్తకంలో వేసింది. ఇప్పటి వరకు జపాన్‌, చైనా, టర్కీ, పోలండ్‌, ఇరాన్‌, పోర్చుగల్‌, బల్గేరియా, క్రొమోషియా దేశాల్లో నిర్వహించిన పోటీల్లో పలు బహుమతులను శివ సాధించాడు. 


logo