మంగళవారం 26 మే 2020
Nizamabad - Jan 28, 2020 , 01:35:09

ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఏకగ్రీవం

ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఏకగ్రీవం

ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ: ఆర్మూ ర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పండిత్‌ వినీత, వైస్‌ చైర్మన్‌గా షేక్‌ మున్నా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదట ఆర్మూ ర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి 10 గంటలకు మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకుని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు జా రీ చేసిన విప్‌ పత్రాన్ని ఆర్డీవో శ్రీనివాసులుకు అందజేశా రు. ఆర్మూర్‌ మున్సిపల్‌ కార్యాలయ సమావేశ మందిరానికి తొలుత టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 23 మంది కౌన్సిల ర్లు, ఒక ఎంఐఎం కౌన్సిలర్‌, టీఆర్‌ఎస్‌లో చేరిన ఐదుగు రు ఇండిపెండెంట్లు, ఒక కాంగ్రెస్‌, ఒక బీజేపీ కౌన్సిలర్‌ చేరుకున్నారు. తర్వాత కాస్త ఆలస్యంగా బీజేపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు సమావేశ హాల్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆర్మూర్‌ ఆర్డీవో, ఎన్నిక అధికారి శ్రీనివాసులు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో వరుసగా 1వ వార్డు పుతిలి బేగం, 2వార్డు సంగీత ఖాందేశ్‌, 3వ వార్డు ఏనుగంటి వరలక్ష్మి, 4వ వార్డు పాలెపు లత(జమున), 5వ వార్డు బం డారి శాలప్రసాద్‌, 6 వార్డు పొద్దూటూరి ము రళీధర్‌రెడ్డి, 7వ వార్డు ఇట్టెడి నర్సారెడ్డి, 8వ వార్డు మెడిదాల సంగీత, 9వ వార్డు కోనపత్రి కవిత, 10వ వార్డు కొంతం మంజు ల, 11వ వార్డు తలారి పింజ మీనా, 12వ వార్డు తాటి హన్మాండ్లు, 13వ వార్డు ఏనుగంటి భారతి, 14వ వార్డు ఇంతియాజ్‌, 15వ వార్డు కోలు గంగామోహన్‌చక్రు, 16 వ వార్డు సుంకరి ఈశ్వరి, 17వ వార్డు అయే షా శీరిన్‌, 18వ వార్డు వనం శేఖర్‌, 19వ వా ర్డు జీవీ నర్సింహారెడ్డి, 20వ వార్డు షేక్‌ మున్నా, 21వ వార్డు లిక్కి శంకర్‌, 22వ వార్డు హర్షదీబేగం, 23వ వార్డు వన్నెల్‌దేవీ లావణ్య, 24వ వార్డు ఆకుల రాములు, 25వ వార్డు అల్జాపూర్‌ రేవతి, 26వ వార్డు సుంకరి సుజాత, 27వ వార్డు బాదం రాజ్‌కుమార్‌, 28వ వార్డు నాజ్నిన్‌ సుల్తానా, 29వ వార్డు సాయికుమార్‌, 30వ వార్డు లింగంపల్లి భాగ్య, 31వ వార్డు కశ్యప్‌ స్వాతిసింగ్‌, 32వ వార్డు జనార్దన్‌ రాజు, 33వ వార్డు పం డిత్‌ వినీత, 34వ వార్డు గాండ్ల లక్ష్మీ, 35వ వార్డు ఆకుల సంగీత, 36వ వార్డు బారడి రమేశ్‌ కుమార్‌ చేత ప్రమాణాస్వీకారం చేయించారు. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక నిర్వహణ సమయం 12.30 గంటలకు కావడంతో 45 నిమిషాలు వేచి చూడాల్సి వచ్చింది. ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌న్ల పేర్లను నేరుగా అధికారులకు సీల్డ్‌ కవర్‌లో పంపించారు. ఎన్నికల కోసం 45 నిమిషాలు ఉండడంతో, సీల్డ్‌ కవర్‌లో చైర్‌పర్సన్‌గా, వైస్‌ చైర్మన్‌గా ఎవరి పేర్లు ఉండనున్నాయోనని నూతనంగా ఎ న్నికైన కౌన్సిలర్లు, ఆర్మూర్‌ ప్రాంత ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు. సీల్డ్‌ కవర్‌లో వచ్చిన పండిత్‌ వినీత పేరును ఆర్డీవో ప్రకటించగా.. పండిత్‌ వినీతను చైర్‌పర్సన్‌గా 36వ వార్డు కౌన్సిలర్‌ బారడి రమేశ్‌ కుమార్‌ ప్రతిపాదించారు. 12వ వార్డు కౌన్సిలర్‌ తాటి హన్మాండ్లు బలపర్చారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పోటీచేసేందుకు సమ్మతమేనా అని పండిత్‌ వినీతకు అధికారులు అడిగారు. ఎవ రూ పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. తర్వాత ఆర్మూర్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా సీల్డ్‌ కవర్‌లోని షేక్‌ మున్నా పేరును ఆర్డీవో శ్రీనివాసులు ప్రకటించారు. 21వ వార్డు కౌన్సిలర్‌ లిక్కి శంకర్‌ ప్రతిపాదించగా.. 32వ వార్డు కౌన్సిలర్‌ జనార్దన్‌రాజు బలపర్చారు.  అనంతరం చైర్‌పర్సన్‌గా పండిత్‌ వినీత, వైస్‌ చైర్మన్‌గా షేక్‌ మున్నాలతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌లకు ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ ఆ దము ల్ల శైలజ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపా రు. చైర్‌పర్సన్‌ పదవి ఆశించిన సంగీత ఖాందేశ్‌ సమావేశ మందిరంలో కంటతడి పెట్టారు. గాండ్లలక్ష్మి, స్వాతిసిం గ్‌, వన్నెల్‌దేవీ లావణ్య, మేడిదాల సంగీత, అల్జాపూర్‌ రేవతి నిరాశ చెందారు. వైస్‌ చైర్మన్‌ పదవి ఆశించి భంగపడ్డ తాటి హన్మాండ్లు, గంగామోహన్‌ చక్రు, ఇట్టెడి నర్సారెడ్డి నిరాశతో తిరిగివెళ్లారు.        

ఘన సన్మానాలు, భారీగా ర్యాలీ... 

ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన పండిత్‌ వినీత, వైస్‌ చైర్మన్‌ షేక్‌మున్నాను పట్టణంలో ప్రముఖులు, రాజకీయ నాయకులు, మద్దతుదారులు, కుల సంఘాల ప్రతినిధులు భారీ ఫూల మాలలతో ఘనంగా సన్మానించారు. చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత భర్త పండిత్‌ పవన్‌, మరిది మాజీ కౌన్సిలర్‌ పండిత్‌ ప్రేమ్‌కు పలువురు పులమాలతో సత్కరించి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఓపెన్‌టాప్‌ జీప్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత, పవన్‌, పండిత్‌ప్రేమ్‌తో, పలువురు కౌన్సిలర్లతో కలిసి ర్యాలీ నిర్వహించి పట్టణ ప్రజలకు అభివాదం చేశారు.


logo