మోర్తాడ్, సెప్టెంబర్ 8: మహారాష్ట్రలో భారీవర్షాల కారణంగా ఎస్సారెస్పీకి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువ గోదావరికి నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయం త్రం 4గంటలకు ఎస్సారెస్పీకి లక్షా 26వేల 865క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. అధికారులు 24 గేట్లు ఎత్తి 99, 968 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. శనివారం రాత్రి ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో పెరగ డంతో అధికారులు 9గేట్లు ఎత్తి 28,116 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.
ఆదివారం ఉదయం 8.30 గంటలకు వరద ఉధృతి మరింత పెరగడంతో 16గేట్లు ఎత్తి 49,984 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఆదివారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఇన్‌ఫ్లో 89,377క్యూసెక్కులకు తగ్గడంతో నాలుగు గేట్లను మూసివేసి 20గేట్ల ద్వారా 62, 480క్యూసెక్కుల నీటిని వదులుతు న్నారు. శనివారం వరద కాలువ కు పదివేల క్యూసెక్కులు వదలగా, ఆదివారం ఉద యం నీటి విడుదలను పెంచి 17 వేలు, సాయంత్రం 18వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ఆదివారం సా యంత్రా నికి 1090.90 అడుగుల (80. 053 టీఎం సీలు) నీరు నిల్వ ఉంది. లక్షా 89, 377 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది.
ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 8: నిజామాబాద్ జిల్లాలో శనివారం 19.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా ఏర్గట్లలో 44.7 మి.మీ, బాల్కొండలో 40.9 మి.మీ, ముప్కాల్‌లో 34.4 మి.మీ, మెండోరాలో 30.0 మి.మీ , అత్యల్పంగా డిచ్‌పల్లిలో7.2 మి.మీ, నిజామాబాద్ రూరల్‌లో 7.7 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
నిజాంసాగర్, సెప్టెంబర్ 8: నిజాంసాగర్ ఎగువప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి 39వేల క్యూసెక్కుల వరద కొనసాగడంతో ప్రాజెక్టు నుంచి ఐదు గేట్ల ద్వారా అంతే మొత్తంలో నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులకు (17.802 టీఎంసీలు) గాను, 1404.50అడుగుల (17.079 టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నదని పేర్కొన్నారు. మంజీర నది పరీవాహక ప్రాంతంలోకి ఎవరూ వెళ్లవద్దని సూచించారు.