రైతుబాంధవుడు సీఎం కేసీఆర్కు ఉమ్మడి జిల్లా రైతాంగం జేజేలు పలికింది. ‘వరి’గోస పడుతున్న అన్నదాతకు తానున్నానని భరోసానిచ్చిన ముఖ్యమంత్రికి బుధవారం పల్లెపల్లెన పాలాభిషేకం జరిగింది. వడ్లు కొనకుండా కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టినా, తమకు ‘మద్దతు’గా నిలిచిన గులాబీ దళపతికి రైతులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ప్రతి ధాన్యపు గింజనూ కొంటామన్న కేసీఆర్ సార్.. తమకు మరోమారు అండగా నిలబడ్డారని వారు ప్రశంసించారు.