ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు
రాష్ట్రంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. క్రిస్టియన్, మైనార్టీ అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని పేర్కొన్నారు.
- క్రిస్టియన్ల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
- సీఎం కేసీఆర్ సహకారంతో చర్చిల అభివృద్ధి
- మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
- చర్చి కమిటీలకు నిధుల ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన మంత్రి
వేల్పూర్, సెప్టెంబర్ 28: రాష్ట్రంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. క్రిస్టియన్, మైనార్టీ అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని పేర్కొన్నారు. మండలంలోని లక్కోరా గ్రామంలో ఉన్న ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో బాల్కొండ నియోజకవర్గంలోని క్రిస్టియన్ మైనార్టీ చర్చిల అభివృద్ధి కోసం మంజూరైన నిధుల ప్రొసీడింగ్ కాపీలను ఆయా చర్చి కమిటీల సభ్యులకు మంత్రి గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సుమారు 40 చర్చిలకు రూ. 2.75 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి వేముల మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలనేది కేసీఆర్ ధ్యేయమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని క్రిస్టియన్లు తనపై చూపే ప్రేమ మరవలేనిదన్నారు. గతంలో చర్చిల అభివృద్ధి కోసం రూ. 1.50 కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు మళ్లీ సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ. 2.75 కోట్లతో చర్చిల అభివృద్ధి కోసంనిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.
క్రైస్తవ మతం విశ్వాసానికి, త్యాగానికి, ప్రేమకు ప్రతీక అని పేర్కొన్నారు. ఏ మతం కూడా ఒకరిని ఇబ్బంది పెట్టాలని చూడదని, ఇతరుల మంచి కోరుకుని వీలైతే సహాయం చేయాలని చెబుతుందన్నారు. అందుకే అందరినీ గౌరవిస్తూ సమానంగా నియోజకవర్గంలోని గుడులు, మసీదులు, చర్చిలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన క్రిస్టియన్లకు మంత్రి వేముల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలాల నుంచి సుమారు రెం డు వేల మంది క్రిస్టియన్లు హాజరయ్యారు.
రానున్న ఎన్నికల్లో వేముల విజయం ఖాయమని విజయం కోసం ముక్తకంఠంతో అందరూ ప్రార్థించి ఆశీస్సులు అందించారు. తన తల్లి ఆరోగ్యం మెరుగుపడాలని అక్కడికి వచ్చిన వారందరూ ప్రార్థించడంతో వారు చూపిన అభిమానానికి మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, తెలంగాణ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ మధుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

