ఖలీల్‌వాడి/ నిజామాబాద్ రూరల్, ఆగస్టు 9 : నియోజకవర్గాల్లోని ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు వీలుగా సీఎం కేసీఆర్ ముందస్తు ఆలోచనతో ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయాలను నిర్మిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్‌లో నిర్మించిన రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్సీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాంపు కార్యాలయం నియోజకవర్గ ప్రజలకు బాసటగా నిలుస్తుందని తెలిపారు. రూ.కోటీ 30 లక్షలతో సర్వ హంగులతో నిర్మించిన కార్యాలయం బాగుందన్నారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రజల కోసం, గ్రామాలభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ముం దుంటామని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ముందస్తు ఆలోచన చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీగౌడ్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, రెడ్కో చైర్మన్ ఎస్ఏ అలీం, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదట కాలూర్ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కవిత శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలూర్ ఊర చెరువు వద్ద రూ.75 లక్షలతో మినీ ట్యాంక్‌బండ్ (సుందరీకరణ పనులు) నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. శివాలయం ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం నగర శివారులోని 3వ డివిజన్ పరిధిలో గల గూపన్పల్లి గంగస్థాన్ ఫేస్-2లో రూ.40లక్షలతో ఏర్పాటు చేయనున్న పట్టణ ప్రకృతి వనానికి భూమిపూజ చేశారు.
రూ.5కోట్లతో గంగస్థాన్ ఫేస్-2లో అభివృద్ధి పనులు:ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
గూపన్పల్లి గంగస్థాన్ ఫేస్-2 కాలనీలో రూ. 5 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నామని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు. కాలనీ ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని స్థానిక అభివృద్ధి కమిటీ కోరగా తనతో పాటు ఎమ్మెల్సీ కవిత కలిసి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దీంతో మంత్రి స్పందిస్తూ రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేశారని త్వరలోనే అభివృద్ధి పనులు చేపట్టేందుకు వర్క్ టెండర్లు పిలుస్తామన్నారు. ఆర్మూర్ రోడ్డు నుంచి గంగస్థాన్ ఫేస్-2లోకి వచ్చే మార్గంలో లోయర్గా ఉన్న బ్రిడ్జిని హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. రూ. 40 లక్షలతో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ జితేష్ వీ పాటిల్, జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతికుమార్, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్‌గౌడ్, టీయూ విద్యార్థి నేత యెండల ప్రదీప్, కార్పొరేటర్లు కొర్వ లలిత, శ్రీనివాస్‌రెడ్డి, నుడా డైరెక్టర్లు ముస్కె సంతోష్, రాజేంద్రప్రసాద్, జడ్పీటీసీ సుమలత, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి మోహన్‌రెడ్డి, సిరికొండ మాజీ ఎంపీపీ మంజుల, మాజీ కార్పొరేటర్ విశాలినిరెడ్డి, నాయకులు బొల్లెంక గంగారెడ్డి, కొర్వ గంగాధర్, మోహన్, అక్బర్, శంకర్, శశికాంత్, స్వామి, జమీర్‌ఖాన్, సుదర్శన్, సొసైటీ చైర్మన్లు శ్రీధర్, మాధవ్‌రెడ్డి, గిర్ధావర్ భూపతిప్రభు తదితరులు పాల్గొన్నారు.