e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home జిల్లాలు నిరుపేదలకు అండగా సర్కారు

నిరుపేదలకు అండగా సర్కారు

ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌
రేషన్‌ కార్డుల పంపిణీ

ఖానాపూర్‌ టౌన్‌, జూలై 30 : నిరుపేదలకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నదని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం పలు గ్రామాలకు చెందిన 431 కుటుంబాలకు రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దశలవారీగా అర్హులకు రేషన్‌ కార్డులను మంజూరుచేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ ఖలీల్‌, ఎంపీపీ అబ్దుల్‌ మోయిద్‌, జడ్పీటీసీ ఆకుల రాజమణి, ఖానాపూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ నరేందర్‌, నాయబ్‌ తహసీల్దార్‌ ఫారూఖ్‌, వీఆర్వో, వీఆర్‌ఏలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సిరికొండలో 41 కుటుంబాలకు..
సిరికొండ, జూలై 30 : స్థానిక తహసీల్‌ కార్యాలయంలో 41 కుటుంబాలకు రేషన్‌ కార్డులు, న లుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎ మ్మెల్యే అందించారు. ఆమె మాట్లాడుతూ.. మం డలంలో రోడ్డు మంజూరైనా అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో పనులు ఆగిపోయాయన్నా రు. రాంపూర్‌ వాగుపై వంతెన, మండల కేంద్రం నుంచి ఇంద్రవెల్లి వరకు బీటీ రోడ్డు మంజూరైనట్లు తెలిపారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ అటవీ హక్కు భూ పట్టాలకు క్రాఫ్‌లోన్‌ ఇవ్వ డం లేదని, రైతులు, వాయిపేట్‌ మాజీ సర్పంచ్‌ శేషరావ్‌ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఆమె స్పందించి పీవో భవేశ్‌ మిశ్రతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమృత్‌ రావ్‌, తహసీల్దార్‌ సర్ఫరాజ్‌, నాయబ్‌ తహసీల్దార్‌ హరిలాల్‌, ఎస్‌ఐలు, కృష్ణకుమార్‌, పొచ్చంపల్లి, పాకిర్‌ నాయక్‌ తండా సర్పంచ్‌లు జయబాయి, లచ్చు, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు బాలాజీ, నాయకులు బషీర్‌, సునీల్‌, అశోక్‌, గంగాధర్‌, ఉప సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లిలో 230..
ఇంద్రవెల్లి, జూలై 30 : మండలంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 230 మందికి రేషన్‌ కార్డులు, 53 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మారుపతి డోంగ్రే పటేల్‌, ఏఎంసీ చైర్మన్‌ రాథోడ్‌ మోహన్‌నాయక్‌, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ అబ్దుల్‌ అమ్జద్‌, తహసీల్దార్‌ రాఘవేంద్రరావ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు మీర్జా జిలానీ బేగ్‌, గిర్దవార్‌ మెస్రం లక్ష్మణ్‌, సర్పంచ్‌లు కోరెంగ గాంధారి, రాథోడ్‌ శారద, గారోలే కుసుమాబాయి, జావదే పార్వతీబాయి, ఇంద్రవెల్లి ఉపసర్పంచ్‌ గణేశ్‌ తైహేరే, రాథోడ్‌ రాంచందర్‌, ఎంపీటీసీలు జాదవ్‌ స్వర్ణలత, గిత్తే ఆశాబాయి, కోవ రాజేశ్వర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు దేవ్‌పూజె మారుతీ, షేక్‌ సుఫియాన్‌, కనక హనుమంత్‌రావ్‌, సుంకట్‌రావ్‌, ఆత్రం మారుపటేల్‌, తొడసం హరిదాస్‌, ఆత్రం ధర్ము, వసంత్‌రావ్‌, శ్రీరాంనాయక్‌, బాబుముండే, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
14 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు..
ఉట్నూర్‌, జూలై 30 : ఎంపీడీవో కార్యాలయంలో 14 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రేఖానాయక్‌ కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్రజైవంత్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ బాలాజీ, ఎంపీడీవో తిరుమల, తహసీల్దార్‌ సురేశ్‌, కో ఆప్షన్‌ రసీద్‌, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అహ్మద్‌ అజీం, మండలాధ్యక్షుడు సింగారే భరత్‌, నాయకులు దాసండ్ల ప్రభాకర్‌, కందుకూరి రమేశ్‌, సీతారాం, కోల సత్యం, కాటం రమేశ్‌, రవి, నాయకులు ఉన్నారు.
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు..
మండలంలోని నాగాపూర్‌ గ్రామానికి చెందిన పీ సునితకు మంజూరైన రూ.15 వేల చెక్కును మండల కేంద్రంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌ అం దించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శారద, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్యాం పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana