శుక్రవారం 05 మార్చి 2021
Nirmal - Jan 16, 2021 , 01:39:40

అభయారణ్యంలో అమాత్యుడు

అభయారణ్యంలో అమాత్యుడు

  • కుటుంబ సభ్యులతో సరదగా గడిపిన మంత్రి అల్లోల
  • కడెం జలాశయంలో బోటుతో షికారు

నిర్మల్‌ అర్బన్‌,/కడెం జనవరి 15 : నిత్యం వివిధ పనుల్లో బిజీబిజీగా గడిపే రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి శుక్రవారం కవ్వాల్‌ అభయారణ్యంలో కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడిపారు. ఉడుంపూర్‌ అటవీ రేంజ్‌ పరిధిలో ఐ లవ్‌ కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ లోగా వద్ద ఫొటోలు దిగారు. కల్పకుంట వాచ్‌టవర్‌ ఎక్కి వన్యప్రాణులను, అటవీ అందాలను వీక్షించారు. పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర, వన్యప్రాణుల సంరక్షణపై ఆయన మనుమలు, మనుమరాలికి అవగాహన కల్పించారు. అనంతరం గంగాపూర్‌ అటవీ, ప్రాంతంలో పర్యటించారు. కడెం ప్రాజెక్టును సందర్శించి, బోటింగ్‌ చేశారు.

కడెంలో ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ బోటు షికారు..

ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, కడెం జలాశయంలో బోటులో షికారు చేశారు. ఆయనతో పాటు తిరుపతి, పీఆర్టీయూ కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రకాశ్‌, రామారావు, రమేశ్‌, ఆకాశ్‌, రవీందర్‌, తదితరులు ఉన్నారు.

మంత్రిని కలిసిన నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే..

మంత్రి అల్లోలను క్యాంపు కార్యాలయంలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ ఈశ్వర్‌, దేవరకోట ఆలయ చైర్మన్‌ లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్‌ ఆమెడ కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీ ఎంప్లాయీస్‌ క్యాలెండర్‌ విడుదల..

మైనార్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(మేవా) క్యాలెండర్‌ను మంత్రి క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. సంఘ అధ్యక్షుడు షేక్‌ షబ్బీర్‌ అలీ, ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ కలీమొద్దీన్‌, రాష్ట్ర, జిల్లా నాయకులు మసియుద్దీన్‌, శిరాజ్‌ ఉద్దీన్‌, మసూద్‌, అన్సర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo