శనివారం 16 జనవరి 2021
Nirmal - Dec 23, 2020 , 01:18:46

నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ అండ

నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ అండ

  • రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  • సీఎం రిలీఫ్‌ ఫండ్‌, ప్రమాద బీమా చెక్కుల పంపిణీ

నిర్మల్‌ అర్బన్‌ : నిరుపేదలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. పట్టణంలోని 36వ వార్డు బుధవార్‌పేట్‌ హరిజన కాలనీకి చెందిన పడిగెల ఎల్లయ్య అనారోగ్యంతో ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స చేయించుకున్నాడు. బాధిత కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి మంత్రి అల్లోలకు టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము వివరించారు. సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేయించారు. కాగా, రూ.60 వేలు మంజూరవగా, మంగళవారం మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో బాధితుడికి చెక్కు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కత్తి సుధాకర్‌, పడిగెల భాను, బండి ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

బీమా చెక్కు అందజేత..

జిల్లా కేంద్రంలోని గాయత్రీ బ్యాంక్‌ శాఖ ఖా తాదారుడు బ్రహ్మత్‌ విక్రం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా, నిర్భయ సేవింగ్‌ ఖాతాపై ప్రమాద బీమా సౌకర్యం కలిగి ఉండడంతో బాధిత కుటుంబానికి రూ.లక్ష మం జూరైంది. సంబంధిత చెక్కును క్యాంప్‌ కార్యాలయంలో బాధిత కుటుంబానికి మంత్రి అందజేశారు. ఖాతాదారులకు బ్యాంక్‌ అందిస్తున్న సేవ లు అభినందనీయమని మంత్రి అన్నారు. అనంతరం బ్యాంక్‌ మేనేజర్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ఖాతాదారులకు కనీస డిపాజిట్‌తో ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.

ప్రమాదం ఎలా జరిగింది..?

  • వివరాలు తెలుసుకున్న మంత్రి అల్లోల

స్థానిక బస్‌ డిపో వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణంలోని పాన్‌గల్లీకి చెందిన అస్నాన్‌ అలీ, సయ్యద్‌ నౌమాన్‌ మృతి చెందారు. కాగా, ఏరియా దవాఖానలో మంగళవారం ఉదయం మృతదేహాలను మంత్రి పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాల గురించి పోలీసులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వెంట మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, పట్టణ సీఐ శ్రీనివాస్‌, ఆయా వార్డుల కౌన్సిలర్లు ఉన్నారు.