బుధవారం 28 అక్టోబర్ 2020
Nirmal - Aug 15, 2020 , 03:42:51

శుభ్రతే జీవనసూత్రం

శుభ్రతే జీవనసూత్రం

  • ‘గందగీ ముక్త్‌' అవగాహనలో డీఐవో విజయసారథి 

భీంపూర్‌: వ్యక్తిగత, పరిసరాల శుభ్రతే ఆరోగ్య జీవనానికి సూత్రమని ఆదిలాబాద్‌ డీఐవో, భీంపూర్‌ పీహెచ్‌సీ వై ద్యాధికారి విజయసారథి సూచించారు. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ - గందగీ ము క్త్‌ భారత్‌లో భాగంగా పీహెచ్‌సీలో అధికారులు, ప్రజా ప్రతినిధులకు శుక్రవా రం అవగాహన కల్పించారు. ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో ప్లాస్టిక్‌ నిషేధం, మురుగు కాలువలు శుభ్రం చేయడం,  క్లోరినేషన్‌, శానిటైజేషన్‌ చేపట్టాలని సూ చించారు. సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులు దీనిపై మరింత శ్రద్ధ చూపాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం, వాడకం చేయాలన్నారు. ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సే వలు వినియోగించుకోవాలన్నారు. గం దగీ ముక్త్‌ భారత్‌ కోసం బాధ్యతగా పని చేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. తహసీల్దార్‌ సోము, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో వినోద్‌, ఎంపీపీ కు డిమెత రత్నప్రభ, జడ్పీటీసీ కుమ్ర సు ధాకర్‌, వైస్‌ ఎంపీపీ గడ్డం లస్మన్న, డాక్ట ర్‌ సరసిజ, ఎస్‌ఐ ఆరిఫ్‌, సూపర్‌వైజర్‌ గంగాధర్‌, ఆర్‌ఐ అశోక్‌, సర్పంచ్‌లు మ డావి లింబాజీ, గొంటిముక్కుల భూమ న్న, కేమ కళ్యాణి, బక్కి అజయ్‌, పెండె పు కృష్ణ, ఉపసర్పంచ్‌ జాదవ్‌ రవీందర్‌, ఉత్తం రాథోడ్‌, పురుషోత్తం, పాండురంగ్‌, నరేందర్‌, కపిల్‌ పాల్గొన్నారు.  


logo