సోమవారం 18 జనవరి 2021
Nirmal - Jun 28, 2020 , 02:02:27

బోథ్ నియోజక వర్గంలో యుద్ద ప్రాతిపదికన నిర్మాణాలు

బోథ్ నియోజక వర్గంలో యుద్ద ప్రాతిపదికన నిర్మాణాలు

  • n ఆన్‌లైన్ టెండర్ల ద్వారా పనుల అప్పగింత
  • n ఇప్పటికే నాలుగు చోట్ల పనులు ప్రారంభం
  • n పెరగనున్న భూగర్భ జలాలు

ఇచ్చోడ: పరిగెత్తే నీటికి నడక నేర్పు.... నడిచే నీటికి నిలకడ నేర్పు అన్న సూక్తిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అమలు చేస్తోంది. తెలంగాణ ప్రాం తంలో పుష్కలమైన నీటి వనరులు ఉన్నా, వాటిని గుర్తించడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో భూగర్భ జలాలు పెరుగక సాగు నీటికి రైతాంగం తీవ్ర కష్టాలను ఎదుర్కొంది. అన్నదాతలు అనేక నష్టాల పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు నీటి రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు.  వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నారు. వానకాలం సాగులో పంట పెట్టుబడి కోసం ఉచితంగా ఎకరాకు రూ. 5 వేలు సాయం అందిస్తూ తో డ్పాటును అందిస్తున్నారు. తాజాగా వెనుకబడిన బోథ్ నియోజక వర్గంలో నీరు వృథా కాకుండా అడ్డుకట్ట వేయడానికి కొత్తగా 18 చెక్ డ్యామ్‌లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకుగాను రూ. 47 కోట్ల 27 లక్షల 51 వేల నిధులు విడుదల చేసింది. దీనిపై నమస్తే తెలంగాణ అందిస్తోన్న ప్రత్యేక కథనం...

సాగు నీటి రంగాన్ని అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు  కొత్త ప్రాజెక్టులను చేపట్టి రైతులకు సాగు నీటిని అందుబాటులోకి తేనుంది. ఇప్ప టికే మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడంతో పల్లె ల్లో తాగు, సాగు నీటి తిప్పలు తీరాయి. అయితే వరదలు వచ్చినప్పు డు నదులు, వాగులు, వంకల ద్వారా నీరు వృథాగా పోతోంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎక్కడి నీటిని అక్కడే కాపాడుకోవడానికి వాగులపై చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 

నియోజక వర్గంలో 18 చెక్ డ్యాంలు

బోథ్ నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో 18 చెక్ డ్యాంలను ని ర్మించేందుకు ప్రభుత్వం రూ. 47 కోట్ల 27 లక్షల 51 వేలను మంజూ రు చేసింది. ఇటీవలే అధికారులు టెండర్లను నిర్వహించి పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రస్తుతం నాలుగు చెక్ డ్యాంల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే), సిరికొండ మండలంలోని సిరికొండ (1), నేరడిగొండ మండల ంలోని తర్నం, బోథ్ మండలంలోని పొచ్చెరలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గడువులోగా పూర్తి చేసేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. సాగు నీటి వనరులు లేని చోట చెక్ డ్యామ్ లే రిజర్వాయర్లు కానున్నాయి. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు, బోరు బావులు, ఓపెన్ బావులు కూడా రీచార్జ్ అయ్యే అవకాశాలున్నాయి. బోథ్ నియోజక వర్గంలో మొత్తం 50 చెక్ డ్యామ్‌ల ని ర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం 27 చెక్‌డ్యామ్‌లను నిర్మించేందుకు అనుమతినిచ్చింది. ఇచ్చోడ సబ్‌డివిజన్‌లో ఆరు మం డలాల్లో 17, (బోథ్ నియోజక వర్గంలో వచ్చే  తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల్లో 10 చొప్పున చెక్‌డ్యామ్‌లు మంజూరయ్యా యి. ప్రస్తుతం ఈ మండలాలు ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నాయి). మిగిలిన మరో 23 చెక్ డ్యామ్‌ల నిర్మాణ పనులకు రెం డవ విడుత అక్టోబర్ నెలలో టెండర్లను ప్రభుత్వం వేయనున్నదని మైనర్ ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. 

గడువులోగా పనులు పూర్తి చేస్తాం

ఇచ్చోడ సబ్ డివిజన్ పరిధిలో మంజూరైన చె క్ డ్యామ్‌లకు టెండర్లు పిలిచాం. టెండర్ల ప్ర కియ, అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయి. ప్ర స్తుతం ముక్రా (కే), సిరికొండ (1) చెక్ డ్యా మ్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇ టీవల కురిసిన వర్షాలకు తర్నం, పొచ్చర చెక్ డ్యామ్‌ల నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. 2021 మార్చి లో పు నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

-భూక్యా భీంరావ్, డీఈ మైనర్ ఇరిగేషన్ శాఖ