శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Jun 25, 2020 , 00:22:37

హరితహారం ప్రతి ఒక్కరి బాధ్యత

హరితహారం ప్రతి ఒక్కరి బాధ్యత

కుభీర్‌: హరితహారం ప్రతి ఒక్కరి బాధ్యతని  నిర్మల్‌ అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు సూచించారు. కుభీర్‌లోని ఐకేపీ కార్యాలయంలో ఎం పీపీ  లక్ష్మీతో కలిసి పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బందితో హరితహారంపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సరీల్లో పెంచిన మొక్కల వి వరాలు, డిమాండ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జేపీఎస్‌లు నిర్లక్ష్యం చేస్తే ఇంటికి వెళ్లాల్సిందేని హెచ్చరించారు.  ప్రతి రోజు జిల్లా కేంద్రంలోని కంట్రోల్‌ రూం నుంచి వీడియో కాల్స్‌ వస్తాయని ఎప్పటికప్పు డు అప్‌డేట్‌ కావాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంప్‌యార్డుకు తరలించాలని ఆదేశించారు. ట్రాక్టర్లను పంచాయ తీ పనులకు మాత్రమే వినియోగించాలన్నారు.  

లోకేశ్వరం: మండల కేంద్రంలోని రెవెన్యూ  కార్యాలయంలో తహసీల్దార్‌ వెంకటరమణతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారాన్ని వంద శాతం విజయవంతం చేయాలని సూచించారు. గ్రామాల్లో చేపడుతున్న డంపింగ్‌ యార్డు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయించాలని ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బా ధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. గ్రా మాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నా రు. ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక పనులను వేగంగా పూర్తి చేయాలని ఎంపీడీవో గంగాధర్‌ను ఆదేశించారు. ఈయన వెంట రెవెన్యూ సిబ్బంది తదితరులున్నారు. logo