బుధవారం 08 జూలై 2020
Nirmal - Jun 04, 2020 , 01:59:10

సర్కారు మాట.. రైతన్న సాగు బాట..

సర్కారు మాట.. రైతన్న సాగు బాట..

“పత్తిని వీలైనంత త్వరగా విత్తాలి. మే చివరి వారం నుంచి జూన్‌ 15 లోపు విత్తితే మంచి దిగుబడులు వస్తయి. ఆ తర్వాత పత్తి సాగు చేయవద్దు. నేల స్వభావం, నీటి వసతిని బట్టి విత్తుకోవాలి. విత్తనం కూడా మేలైన రకం ఎంచుకోవాలి.” అని తెలంగాణ సర్కారు రైతులకు అవగాహన కల్పిస్తున్నది. అందుకు అనుగుణంగానే రైతులు ముందస్తు సాగుకు సిద్ధమయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటి గ్రామంలో వెంకట్‌రెడ్డి అనే రైతు తనకున్న ఆరెకరాల్లో బుధవారం నుంచి పత్తి విత్తనాలు విత్తడం మొదలు పెట్టాడు. వర్షాలు కురవడం, సర్కారు ముందస్తుగా విత్తనాలు వేయాలని చెప్పడంతో వేస్తున్నామని రైతు తెలిపాడు. ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల పంట భూముల్లో దుక్కులు దున్నడం, సేంద్రియ ఎరువులు వేయడం, కరెంటు మోటర్లు మరమ్మతులు చేయడం, కావాల్సిన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడంతో రైతులు బిజీగా మారిపోయారు.                     - భీంపూర్‌


logo