శనివారం 04 జూలై 2020
Nirmal - Jun 03, 2020 , 04:46:50

పల్లె ప్రగతి స్ఫూర్తితో ముందుకు..

పల్లె ప్రగతి స్ఫూర్తితో ముందుకు..

  • తొలి, మలి విడుత సత్ఫలితాలిచ్చాయి.. 
  • సీఎం కేసీఆర్‌ నిర్ణయాలతో ప్రగతి పథంలో ప్రయాణం
  • గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం.. స్వరాష్ట్రంలో సాకారం.. 
  • ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలతో కరోనా వ్యాప్తి నియంత్రణ
  • ‘నమస్తే తెలంగాణ’తో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

“తొలి, మలి విడుత పల్లె ప్రగతి కార్యక్రమాలు అనూహ్య మార్పులు తీసుకొచ్చాయి. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, పారిశుధ్యం మెరుగైంది. పల్లెలు ప్రగతిపథంలో ప్రయాణిస్తున్నాయి. ప్రతినెలా పల్లెలకు నిధులు వస్తున్నాయి. ఇదంతా సీఎం కేసీఆర్‌ నిర్ణయం వల్లనే సాధ్యమైంది. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో సాకారమైందని మేము భావిస్తున్నాం” అని రాష్ట్ర అటవీ, పర్యావరణ,  న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం అమలు, కరోనా వ్యాప్తి నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు.. తొలి, మలి విడుత పల్లె ప్రగతి కార్యక్రమాల ఫలితాలు వంటి అంశాలపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..                 

- నిర్మల్‌, నమస్తే తెలంగాణ

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : “పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత, పారిశుధ్యం మెరుగు కావడంతోపాటు క్రమశిక్షణ, నిర్వహణ పద్ధతులు మెరుగయ్యాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లె లు, పట్టణాల రూపురేఖలు మారిపోయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు ఉపయోగపడుతాయి. ఇప్పటికే పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత, పచ్చదనంపై అవగాహన రావడంతోపా టు అమలులో చూపుతున్నాయి.” అని మంత్రి అల్లోల అన్నారు. మంత్రితో ‘నమస్తే’ ముఖాముఖి పూర్తి వివరాలు..

నమస్తే తెలంగాణ : పారిశుధ్య కార్యక్రమాలు సత్ఫాలితాలు ఇచ్చాయని భావిస్తున్నారా?

మంత్రి అల్లోల : తొలి, మలి విడుత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రత, పచ్చదనం, పారిశుధ్యం మెరుగైంది. సీఎం కేసీఆర్‌ నిర్ణయం వల్ల పంచాయతీకి ఒక ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌, బ్లేడ్‌ ఇవ్వడంతో చెత్త సేకరణతోపాటు డంపింగ్‌యార్డుకు తరలింపు, తడి-పొడి చెత్తను వేరు చేయడం, కంపోస్ట్‌ ఎరువును తయారు చేస్తున్నారు. ట్యాంకర్‌తో మొక్కలకు నీరు పోయడంతో 75-80 శాతం మొక్కలు బతుకుతున్నాయి. ప్రతి గ్రామపంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాం. గ్రామాల్లో వీధిదీపాల కో సం మూడో వైర్‌ వేసి నిర్వహణ మెరుగుపర్చాం. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ, గ్రామ గ్రామానికి తాగునీరు అందిస్తున్నాం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నా యకత్వంలో సాకరమైందని మాకళ్లతో చూ స్తు న్నాం. పట్టణాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపా లు, మొక్కలు పెట్టి రూపురేఖలు మారుస్తున్నాం.

నమస్తే : కరోనా నేపథ్యంలో ప్రస్తుత పారిశుధ్య కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి?

మంత్రి : తొలి, మలి విడత సత్ఫలితాలు ఇవ్వడంతో వాటి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం. కరోనా విజృభించక పోవడానికి దోహదపడింది. మళ్లీ జూన్‌ 1 నుంచి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు ప్రారంభించాం. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, దోమల నివారణ, నీటి నిల్వ లేకుండా చూడటం వంటి ఐదు అంశాలపై దృష్టి సారించాం. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు, స్ఫూర్తితో నాయకులు ఎవరికివారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తున్నారు. నిర్మల్‌ లాంటి జిల్లా కేంద్రంలో ఇప్పటికే సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. పిచ్చి మొక్కలు తొలగించి చెత్త బయట లేకుండా తరలిస్తున్నాం.  నిర్మల్‌ పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నాం. స్వచ్ఛమైన పట్టణంగా మారుస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం వచ్చే వారి కోసం పట్టణంలో మరుగుదొడ్లు నిర్మించేందుకు నిర్ణయిం చాం. ఇందుకోసం స్థలాలను కూడా గుర్తించాం. నిర్మల్‌ పట్టణానికి మిషన్‌ భగీరథ నీరు రావడంతో ఖాళీ బిందెలతో ధర్నాలు అడ్డుకోవడం, నిరసనలు లేవు. ఇది తెలంగాణవ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ నిర్ణయం వల్లనే సాధ్యమైంది.

నమస్తే : గ్రామాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

మంత్రి : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం గ్రామ పంచాయతీలకు జనాభా ప్రకారం ప్రతినెలా డబ్బులు ఇస్తున్నాం. దీంతో కనీసం ఏడాదికి రూ.8 లక్షలకు తక్కువ కాకుండా ప్రతి గ్రామ పంచచాయతీకి వస్తున్నాయి. నిర్మల్‌ పట్టణానికి ప్రతినెలా రూ.82 లక్షలు ఇస్తున్నాం. ఇల్లా అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణాలకు ప్రతినెలా డబ్బులు రావడంతో పచ్చదనం, పరిశుభ్రత, పారిశుధ్యం లాంటి చర్యలు చేపడుతున్నారు. ఇంకా 15వ ఆర్థిక సంఘం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, ఎమ్మెల్యే, ఎంపీ నిధులు కూడా వస్తున్నాయి. 

నమస్తే : నియంత్రిత సాగు విధానంపై రైతులకు ఇచ్చే సూచనలేమిటీ?

మంత్రి : సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారు. రాబోయే రోజుల్లో రైతులు ఇబ్బంది పడొద్దని నియంత్రిత సాగు విధానం అమలు చేస్తున్నాం. సీసీఐ కోటి బేళ్లను కొంటామ ని ఇప్పటికే పేర్కొంది. దీంతో ఈసారి పత్తి ఎక్కువగా పండించాలని నిర్ణయించాం. వరి, సోయాబీన్‌, కందులు ఎక్కువ మొత్తంలో సాగు చే యాల్సి ఉంది. వానకాలంలో మక్క వేసుకోవద్దని,  యాసంగిలో వేసుకోవాలని సూచిస్తున్నాం. రైతు ఏ పంట పండించినా రెండు, మూడు రో జుల్లో కొనుగోళ్లు పూర్తి కావాలని, ఎదురు చూడకుండా ఉండేందుకే నియంత్రిత సాగు విధానం అమలు చేస్తున్నామన్నారు. బహిరంగ మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలు పండిస్తే వ్యాపారులే కొం టారు. ప్రభుత్వం మద్దతు అవసరం ఉండదు. అందుకే సీఎం కేసీఆర్‌ అన్ని విధాల ఆలోచించి మేధావులతో నిర్ణయించి ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతుబంధు అందరికీ రావాలనే ఉద్దేశంతోనే  నియంత్రిత సాగు విధానం తీసుకొచ్చారు. ఐదారు రోజుల్లో రైతు ఏ పంటలు సాగు చేస్తారో నివేదిక పంపిస్తాం. దీంతో రైతుబంధు డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతాయి.

నమస్తే : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై మీ స్పందన?

మంత్రి : కరోనా వల్ల లారీలు, హమాలీల కొరత ఉన్నప్పటికీ బీహార్‌ నుంచి ప్రత్యేకంగా  కూలీలను రప్పించి మక్కలు, ధాన్యాన్ని కొనుగోలు చేశాం. మక్కలకు గోదాంలు లేకపోతే మేడ్చల్‌, నందిపేట్‌, ధర్మాబాద్‌, నిజామాబాద్‌, దండేపల్లితోపా టు స్థానికంగా ఉన్న ఫంక్షన్‌ హాళ్లు, కుల సం ఘాలు, జిన్నింగ్‌ మిల్లుల్లో నిల్వ చేశాం. ఈసారి మక్కలు ఎక్కువగా దిగుబడి వచ్చాయి. అయినప్పటికి సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రతి గింజకూ మద్దతు ధర ఇచ్చాం. స్థానికంగా గో దాంలు సరిపోకుంటే పెద్దపల్లి, మెదక్‌ జిల్లాల్లో గోదాంలు తీసుకొని నిల్వ చేస్తున్నాం. ఎండలో ఎక్కువగా ఎ ండడం వల్ల నూక వస్తుంది. దీంతో పాటు తాలు సమస్య ఉందని రైస్‌మిల్లర్లు చెబుతున్నారు. అయినప్పటికీ రైతులు పండించిన ప్రతి గింజకూ మ ద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. జూన్‌ 8లోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం. ప్రతిపక్ష నాయకులకు ఏమి తొచడం లేదు. ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదు. ప్రభు త్వం బాగా చే స్తుంటే అది చెప్పకుండా అభినందించకుండా ధ ర్నాలు, రాస్తారోకలంటూ రాజకీయం చేస్తున్నా యి. రైతులు లేకుండానే నలుగురు నా యకులు కలిసి ధర్నాలు చేస్తున్నారు. రైతులకు ఏమి కా వాలో రైతు పక్షపతిగా సీఎం కేసీఆర్‌ ఇప్పటికే నిరూపించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కాళేశ్వరం ప్యాకేజీ 27 పనులపై ఆయకట్టు లేదంటూ ప్రధానికి ఫిర్యాదు చేశారు. ఆయన వల్ల ఈ ప్రాజెక్టు నాలుగు ఏళ్లు ఆగింది. సీఎం కేసీఆర్‌ వచ్చాక చూసి సర్వే చేసి నిధులిచ్చారు. అలాంటి రైతు వ్యతిరేకి ఇప్పుడు రైతుల గురించి ఆలోచిస్తారా? రైతులకు నీరిచ్చే పనులను ఆపిన వారు ఇప్పుడు ధర్నాలు  చేయిస్తున్నారు. రైతుల గు రించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఎవరు ఎ న్ని చెప్పిన, ఏమి మాట్లాడిన సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు పక్షపతి. రాబోయే రోజుల్లో రైతులకు ఒక శుభవార్త వస్తుందని అం తా ఎదు రు చూస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఏమి ప్ర కటన చేసిన స్వాగతిస్తున్నాం. ఆయన రైతు పక్షపతి కావడం వల్లనే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

నమస్తే : కరోనా నియంత్రణ కోసం ఏమి చర్యలు తీసుకున్నారు?

మంత్రి : జిల్లాలో కరోనా నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. సర్పంచ్‌ నుంచి  మంత్రి వరకు చాలా కష్టపడ్డారు. పోలీస్‌, వైద్య, పారిశుధ్య, ఇతర రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల అధికారులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఆశ వర్కర్లు గ్రామాల్లో తిరిగి సర్వేలు చేశారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా కట్టడి చేయగాలిగాం. రెడ్‌జోన్‌ నుంచి గ్రీన్‌జోన్‌లోకి వచ్చాం.  సడలింపులు ఉన్నాయని ఎవరూ కూడా అజాగ్రత్తగా ఉండవద్దు. మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్‌ తప్పనిసరి. కరోనా కట్టడికి సహకరించిన ప్రజలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

నమస్తే : జిల్లాలో సాగునీరు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

మంత్రి : కాళేశ్వరం 27, 28 ప్యాకేజీ, సదర్మాట్‌ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే జిల్లాలో 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇప్పటికే సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌ వచ్చి వెళ్లాక ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. ఇటీవల సీఎం ఓఎస్డీ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్యాకేజీ 27లో 65 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా 35 శాతం పనులను పూర్తిచేయిస్తాం. ప్యాకేజీ 27తో నిర్మల్‌ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలు, ప్యాకేజీ 28తో  ముథోల్‌ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలు, సదర్మాట్‌తో 15 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి జిల్లా రైతాంగానికి నీరు అందిస్తాం.

నమస్తే : హరితహారం ఎప్పుడు మొదలవుతోంది?

మంత్రి : రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 20 నుంచి తెలంగాణ హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తాం. ప్రతి గ్రామపంచాయతీకొక నర్సరీని ఏర్పాటు చేసి స్థానికంగా మొక్కలు పెంచుతున్నాం.  అటవీశాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ పంచాయతీ రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటుతాం. వన్యప్రానుల సంరక్షణకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. సోలార్‌ను ఉపయోగించి బోర్లతో నీరు అందిస్తున్నాం. పచ్చగడ్డి క్షేత్రాలు పెంచుతున్నాం. సాసర్‌పిట్‌కు పెట్టి నీరు నింపుతున్నాం. తడోబా, ఇప్పేశ్వర్‌ నుంచి ఆరుపెద్ద పులులు వచ్చాయి వీటి కదలికలను పరిశీలిస్తున్నాం. పెద్ద పులులను సురక్షిత ప్రాంతంలో ఉండేలా చూస్తున్నాం.


logo