గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Jan 20, 2020 , 23:51:30

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
  • -నేడు సిబ్బందికి పోలింగ్‌ సామగ్రి పంపిణీ
  • -ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
  • -నేడు, రేపు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు
  • -ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ ప్రశాంతి


మున్సిపల్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ ఎం.ప్రశాంతి తెలిపారు. సోమవారం ఆమె జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం నుంచి సిబ్బందికి పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ,ప్రైవేటు విద్యా సంస్థలకు మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.
-నిర్మల్‌ టౌన్‌

నిర్మల్‌ టౌన్‌: ఈనెల 22న నిర్వహించనున్న మున్సిపల్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో సోమవారం ఆమె ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం ఉదయం సిబ్బందికి పోలింగ్‌ సామగ్రిని సిబ్బందికి అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అకారులకు సూచించారు. పోలింగ్‌ సామగ్రి పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీజనల్‌ డైరెక్టర్‌ సాయిమన్సూర్‌, కమిషనర్‌ వెంకటేశ్వర్లు, డీఈ సంతోష్‌, ఎంపీడీవో మోహన్‌, రమేశ్‌, అధికారులు జగదీశ్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఓటు వేసేందుకు గుర్తింపుకార్డుతో రావాలి

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేవారు ఓటరు స్లిప్పుతో పాటు ఏదేనా గుర్తింపుకార్డును వెంట తీసుకురావాని కలెక్టర్‌ ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల గుర్తింపుకార్డుతో పాటు ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఫొటో కూడిన గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక కార్డును వెంట తీసుకురావాలని అన్నారు. అదే విధంగా కార్మికశాఖ, ఆరోగ్యబీమా మాజీ సైనిక ఉద్యోగులు తదితర గుర్తింపుకార్డులను సైతం అనుమతిస్తారని అన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాని కోరారు.

నేడు, రేపు సెలవు

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లా లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్‌ ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిర్మల్‌, ఖానాపూర్‌, భైంసా మున్సిపాల్టీల్లో ఈనెల 22న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వియోగించుకోవాలనే ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
logo
>>>>>>