UGC NET : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నిర్వహించే UGC NET పరీక్ష భారతదేశ విద్యారంగంలో నిర్వహించే అత్యున్నత పరీక్షల్లో ఒకటి. తాజాగా డిసెంబర్ 2024 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్టీఏ అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి డిసెంబర్ 10న రాత్రి 11:50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పరీక్షలు ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం 2025 జనవరి 1 నుంచి జనవరి 19 వరకు జరగుతాయి. పరీక్షల షెడ్యూల్, సెంటర్ వివరాలు, అడ్మిట్ కార్డ్‌ల వివరాలను పరీక్ష తేదీకి కొన్ని రోజుల ముందు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. దరఖాస్తు చేయగోరే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్ క్యాటగిరీ అభ్యర్థులు మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు (SC/ST/OBC/PwD) 50% మార్కులు పొంది ఉండాలి.
వయో పరిమితి : జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (JRF) అభ్యర్థి వయస్సు 31 సంవత్సరాలు లోపు ఉండాలి. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు (SC/ST/OBC/PwD), మహిళా అభ్యర్థులకు 5 సంవత్సరాల రాయితీ ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో వయో పరిమితి లేదు.
సబ్జెక్ట్ క్వాలికేషన్స్ : అభ్యర్థి ఎంచుకున్న UGC NET సబ్జెక్ట్ మాస్టర్స్ డిగ్రీలోని సబ్జెక్ట్ లేదా సంబంధిత విభాగంలోని సబ్జెక్ట్ అయి ఉండాలి.
పీజీ ఫైనల్ అభ్యర్థులు : మాస్టర్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న అభ్యర్థులు కూడా UGC NET కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారి పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పీహెచ్డీ అభ్యర్థులు : ఇప్పటికే పీహెచ్డీ చేసిన అభ్యర్థులు కూడా UGC NET పరీక్ష రాయడానికి అర్హులు.
అంతర్జాతీయ అర్హతలు : UGC NET పరీక్షను విదేశాల్లో ఉన్న అభ్యర్థులు కూడా రాయవచ్చు. విదేశీ అభ్యర్థులు భారతదేశంలో UGC NET పరీక్ష రాయాలనుకుంటే ప్రామాణిక స్టూడెంట్ వీసా ఉండాలి.
పరీక్ష రుసుము : జనరల్: రూ.1150, జనరల్, ఓబీసీ,ఈడబ్యూఎస్ : రూ.600, ఎస్టీ, ఎస్సీ, పీడబ్యూడీ, ట్రాన్స్జండర్స్ : రూ.325