హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 151 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి మల్టీజోన్ పోస్టులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 151
మల్టీ జోన్-1లో 68 పోస్టులు (జనరల్ 27, బీసీ-ఏ 5, బీసీ-బీ 5, బీసీ-సీ 1, బీసీ-డీ 5, బీసీ-ఈ 2, ఎస్సీ 10, ఎస్టీ 4, ఈడబ్ల్యూఎస్ 7, ఇతరులు 2)
మల్టీ జోన్-2లో 83 (జనరల్ 32, బీసీ-ఏ 7, బీసీ-బీ 7, బీసీ-సీ 1, బీసీ-డీ 5, బీసీ-ఈ 3, ఎస్సీ 12, ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్ 8, ఇతరులు 2) చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎల్ఎల్బీ లేదా బీఎల్ చేసి, సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. అదేవిధంగా అభ్యర్థులు 2021, జూలై 1 నాటికి 34 ఏండ్ల లోపువారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
పరీక్ష విధానం: మొత్తం రెడు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్లో 200 బహుళైచ్చిక ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కుల చొప్పున కేటాయించారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండో పేపర్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750
వెబ్సైట్: www.tslprb.in