టీకా సూది సరిగ్గా పొడవకపోతే రక్తం గడ్డకట్టే ప్రమాదం

వాషింగ్టన్, జూలై 3: ఎడినోవైరస్ ఆధారంగా తయారు చేసిన కరోనా టీకాలు (అస్ట్రాజెనెకా, జే అండ్ జే, స్పుత్నిక్ వీ) వేసుకొన్నవారిలో రక్తం గడ్డకట్టడానికి.. ఇంజెక్షన్ సరిగ్గా వేయకపోవడం కూడా ఓ కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. టీకా వేసేటప్పుడు ఇంజెక్షన్ సరిగా పొడవకపోతే నరాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని ఇటలీ, జర్మనీలోని మ్యూనిక్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. టీకా కండరానికి వేయాలి. అయితే ఇంజక్షన్ వేసేటప్పుడు కొందరు చర్మాన్ని లాగి పట్టుకోవడం వల్ల సూది కొస కండరానికి చేరదని శాస్త్రవేత్తలు చెప్పారు. టీకా మందు నరాల్లోకి వెళ్లినప్పుడు రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని తెలిపారు.
కరోనా నుంచి కోలుకొన్నవారికి డెల్టా నుంచి ఎక్కువ రక్షణ
కరోనా నుంచి కోలుకొన్న వారు ఒక్క డోసు టీకా వేసుకొన్నా మిగతా వారితో పోల్చితే డెల్టా వేరియంట్ నుంచి ఎక్కువ రక్షణ లభిస్తుందని ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

