PECET | బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) హాల్‌టికెట్లు బుధవారం విడుదలకానున్నాయి. అభ్యర్థులు https://pecet.tsche.ac. in వెబ్‌సైట్‌ను సంప్రదించి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్ తెలిపారు.
ఈ నెల 10 నుంచి 13 వరకు ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్కిల్ టెస్టులను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 6 : 30 గంటల నుంచి కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు జరుగుతాయని చెప్పారు. ఈ నెల 10, 11వ తేదీల్లో పురుషులకు, 12, 13వ తేదీల్లో మహిళలకు టెస్టులను నిర్వహిస్తామని తెలిపారు.