Tenth Exams | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి ప్రారంభంకానున్నాయి. 3 నుంచి 13 వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 42,832 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హాల్టికెట్లు విడుదల చేశామని, విద్యార్థులు www. bse. telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.