ICET 2024 | తెలంగాణలో 2024- -25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఐసెట్ 2024 పరీక్ష ఆన్సర్ కీ ని కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది.
ఆన్సర్ కీతో పాటు పరీక్ష ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్సైట్లో ఉంచింది. అభ్యర్థులు తమ ఐసెట్ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ల ద్వారా తమ రెస్పాన్స్ షీట్లను పొందవచ్చు. ప్రాథమిక కీపై జూన్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం ఫైనల్ కీ, ఫలితాలను వెల్లడించనున్నారు.