హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్సెట్-2026 ను ఈనెల 12న ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్టు టీజీ ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బీ వెంకట్రామ్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. https://edcet. tgche. ac.in వెబ్సైట్లో ఈ నెల 9న ఉదయం 10గంటల నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
రూ.5వేల ఆలస్య రుసుముతో ఈనెల 8,9 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించారు. గురువారం సాయంత్రం 4గంటల వరకు 35,842 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 16 రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేశామని, 59 పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో (ఉదయం 10 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్న ం 2 నుంచి 4గంటల వరకు) రెండు సెషన్ల్లో నిర్వహిస్తామని తెలిపారు.