వేములవాడ, జూలై 22: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు. జాతర గ్రౌండ్లోని గాజుల దుకాణాలు, బొమ్మలు, వంట సామ గ్రి అద్దెకిచ్చే షాపులే లక్ష్యంగా పది దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. వంట సామగ్రి అద్దెకిచ్చే దుకాణంలో కి చొరబడిన దొంగలు దర్జాగా కోడిగుడ్ల కూర, బగారా అన్నం వండుకొ ని తిని, శీతల పానీయాలు తాగారు. పది దుకాణాల్లో రూ.3లక్షల విలువైన వస్తువులతో పాటు రూ.30వేల నగదు అపహరించుకుపోయినట్టు బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.