న్యూఢిల్లీ, జూలై 22: నీతి ఆయోగ్ సీఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్‌ను కేంద్రం బుధవారం నియమించింది. కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన అనురాగ్ ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండేండ్ల పాటు అందులో కొనసాగుతారు.